Charles Kushner: అమెరికా రాయబారి చార్లెస్ కుష్నర్‌కు సమన్లు

అమెరికా రాయబారి చార్లెస్ కుష్నర్ (Charles Kushner) కు ఫ్రాన్స్ (France) సమస్లు జారీ చేసింది. యూదు వ్యతిరేకత పెరుగుదలను అరికట్టడంలో విఫలమయ్యారనే ఆరోపణలను విదేశాంగ శాఖ తోసి పుచ్చింది. కుష్నర్ వ్యాఖ్యలు ఆమోదయోగం కాదని పేర్కొంది. రాయబారులు తమ దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి అనుమతించబోమని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన అల్లుడు జారెడ్ కుష్నర్ (Jared Kushner) తండ్రి చార్లెస్ కుష్నర్‌ను ఫ్రాన్స్ రాయబారిగా నియమించిన విషయం తెలిసిందే.