Fire Accident: అమెరికాలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి!
అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో (Fire Accident) ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మొత్తం 13 మంది విద్యార్థులు బర్మింగ్‌హామ్‌లోని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్నారు. శుక్రవారం అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో, కొద్దిసేపటికే దట్టమైన పొగ కాంప్లెక్స్ అంతా వ్యాపించింది.
దీంతో లోపల చిక్కుకున్న విద్యార్థులు శ్వాస ఆడక అల్లాడిపోయారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక (Fire Accident) సిబ్బంది, లోపల చిక్కుకున్న 13 మంది విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు. తెలుగు విద్యార్థులు ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అయితే చికిత్స పొందుతూ ఆ ఇద్దరూ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిని హైదరాబాద్‌కు చెందిన ఉడుముల సహజ రెడ్డి, కూకట్‌పల్లికి చెందిన మరో విద్యార్థిగా గుర్తించారు. ఈ (Fire Accident) ఘటనపై భారతీయ విద్యార్థుల్లో, స్థానిక తెలుగు కమ్యూనిటీలో తీవ్ర విషాదం అలుముకుంది.






