ఇండియానాపొలిస్ లో మరోసారి కాల్పుల కలకలం
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఇండియానా రాష్ట్రం ఇండియానాపొలిస్లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ఓ పోలీసు అధికారి, మరో నలుగురు గాయపడ్డారు. తూర్పు వాషింగ్టన్ కాలనీలోని ఓ బార్ పార్కింగ్ ప్రదేశంలో అర్థరాత్రి సమయంలో ఘర్షణ ఏర్పడిరది. ఆ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణకు కారణమైన వ్యక్తులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. దీంతో ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుతో పాటు మరో నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.






