America : అమెరికా తప్ప .. మిగతా అన్ని దేశాలు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా
ఒక్క అమెరికా (America) తప్ప ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలన్నీ గాజా (Gaza) సిటీని స్వాధీనం చేసుకోవాలంటూ ఇజ్రాయెల్ (Israel) తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. భద్రతా మండలి అత్యవసర సమావేశంలో గాజా పరిస్థితిపై సమీక్ష జరిగింది. ఇజ్రాయెల్ సైనిక విస్తరణను ఫ్రాన్స్ (France), బ్రిటన్, చైనా, రష్యా(Russia) ఖండిరచాయి. గాజా సిటీని స్వాధీనం చేసుకోవడం తప్పు అని, ఆ నిర్ణయాన్ని పున పరిశీలించాలని ఇజ్రాయెల్‌ను బ్రిటన్ కోరింది. ఫ్రాన్స్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గాజా ఆక్రమణను చైనా తప్పుబట్టింది. నిర్లక్ష్యంగా ఉద్రికత్తలను పెంచడాన్ని రష్యా ఆక్షేపించింది. అమెరికా మాత్రం ఇజ్రాయెల్‌ను సమర్థించింది. గాజాలో హింసకు హమాసే కారణమని తెలిపింది.







