Michael Rubin: అసీం మునీర్ లాడెన్ లాంటి వాడు .. మైఖెల్ రూబిన్ మండిపాటు
అమెరికా పర్యటనలో ఉండగానే అణు బెదిరింపులకు పాల్పడిన పాకిస్థాన్ సైన్యాధిపతి అసీం మునీర్ (Asim Munir )ను పెంటగాన్ మాజీ అధికారి తీవ్రంగా విమర్శించారు. మునీర్ సూట్లో ఉన్న కరడుగట్టిన ఉగ్రవాది, అల్‌ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్(Osama bin Laden) అని మైఖెల్ రూబిన్ (Michael Rubin) అన్నారు. సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తామని బెదిరిస్తున్న పాకిస్థాన్ (Pakistan) చట్టబద్ధమైన దేశంగా ఉండే హక్కును కోల్పోయిందని మండిపడ్డారు. అమెరికా గడ్డపై ఉండి పాక్ ఆర్మీ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదు. ఈ బెదిరింపు నేపథ్యంలో పాకిస్థాన్ ఒక దేశంగా తమ బాధ్యతలను నిర్వర్తించగలదా అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. మునీర్ వ్యాఖ్యలు గతంలో ఐసిస్, ఒసామా బిన్ లాడెన్ చేసిన ప్రకటనలను తలపిస్తున్నాయి. ఆయన మాటలను ట్రంప్ (Trump) సర్కార్ వెంటనే ఖండిరచి, దేశం నుంచి బహిష్కరించాల్సింది. పాక్‌పై దౌత్యపరమైన చర్యలు తీసుకుని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశంగా గుర్తించాలి అని రూబిన్ అన్నారు.







