Russia: పుతిన్ చర్చలకు రావాలి : ఈయూ చీఫ్

ఉక్రెయిన్ పై దాడులను రష్యా తక్షణమే నిలిపివేయాలని, శాంతి చర్చలకు ముందుకు రావాలని యురోపియన్ యూనియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్‌డెర్ లేయన్ (Ursula von der Leyen) కోరారు. ఉక్రెయిన్ రక్షణ, భద్రత, శాశ్వత స్థిరత్వానికి యూరప్ నుంచి మద్దతను ఆమె పునరుద్ఘాటించారు. కీవ్‌పై రష్యా వైమానిక దాడుల్లో 21 మంది మరణించడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పుతిన్ చర్చలకు రావాలి. సామాన్య పౌరులు, మౌలిక సదుపాయాలపై రష్యా నిరంతర దాడులను యూరప్(Europe) సహించబోదన్నారు. ఉక్రెయిన్ (Ukraine) కు విశ్వసనీయ భద్రతా హామీలతో పాటు న్యాయమైన, శాశ్వత శాంతి నెలకొల్పేందుకు తమ మద్దతు ఉంటుందని నొక్కి చెప్పారు. అందుకోసం ధైర్యవంతులైన ఉక్రేనియన్ సాయుధ దళాలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తామన్నారు.