కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అమెరికా
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుంది. దీనిపై తాజాగా అమెరికా నుంచి స్పందన వచ్చింది. భారత్లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టుపై ఈ-మెయిల్లో అడిగిన ఓ ప్రశ్నకు యూఎస్ అధికారిక ప్రతినిధి బదులిస్తూ సమయానుకూల, పారదర్శక న్యాయప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నాం అని వెల్లడిరచారు.






