Elon Musk :డొనాల్డ్ ట్రంప్ పై … ఎలాన్‌ఖ మస్క్ అసమ్మతి గళం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన సన్నిహిత మిత్రుడు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ ( డోజ్) చీఫ్, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన పన్నులు (Taxes) , వ్యయాల బిల్లులను తీవ్రంగా తప్పుపట్టారు. ట్రిలియన్ డాలర్ల మేర పన్నులు చేయకుండా నిలిపివేయడం, రక్షణ రంగం(Defense sector )పై వ్యయాన్ని భారీగా పెంచాలని ట్రంప్ నిర్ణయించడం సరైంది కాదని కుండబద్ధలు కొట్టారు.ఈ సందర్భంగా ఎలాన్ మాస్క్ మాట్లాడుతూ బిగ్, బ్యూటిఫుల్ అంటూ ట్రంప్ చెబుతున్న బిల్లు గొప్ప బిల్లుగా తాను భావించడం లేదన్నారు. అది చాలా పెద్దది లేదా అందమైనది అని తాను ఎంతమాత్రం అనుకోవడం లేదని తేల్చి చెప్పారు.
గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఎలాన్ మస్క్ బహిరంగంగా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భారీగా ఆర్థిక సాయం సైతం అందజేశారు. ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఎలాన్ మస్క్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.ప్రభుత్వ ఖర్చులను, ఉద్యోగుల (Employees) సంఖ్యను తగ్గించడానికి ఉద్దేశించిన డోజ్ చీఫ్ (Doge Chief) పదవిని కట్టబెట్టారు. అలాంటి తన మిత్రుడు ట్రంప్‌పై ఎలాన్ మస్క్ అసమ్మతి గళం విప్పడం చర్చనీయాంశంగా మారింది. పన్నుల్లో కోతలకు, రక్షణ వ్యయం పెంపునకు తాను వ్యతిరేకం అని పరోక్షంగా ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు.