Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కు సెంటిమెంట్ భయం

ఒకప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి సినిమా వస్తుందంటే, మాస్ ప్రేక్షకుల్లో పక్కా ధీమా ఉండేది. సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం కూడా వారిలో ఎక్కువ. అయితే గత కొన్ని రోజులుగా, మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క సినిమా అంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. మెగాస్టార్ చిరంజీవి నుంచి కిందిస్థాయి హీరోల వరకు ఒక్కరు కూడా హిట్ కొట్టలేకపోయారు. ఒక్క అల్లు అర్జున్ మినహా.. మిగిలిన హీరోలందరి విషయంలో, అభిమానుల్లో అసంతృప్తి ఎక్కువగా ఉంది. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదనే ఆరోపణలు సైతం ఫాన్స్ చేస్తున్నారు.
అలాగే డైరెక్షన్ విషయంలో కూడా హీరోలు వేలు పెడుతున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. ఇటీవల రామ్ చరణ్, చిరంజీవి(Chiranjeevi), పవన్ కళ్యాణ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో సినిమా రిలీజ్ చేస్తున్నారు. భారీ అంచనాలతో వస్తున్న “ఓ జి”(OG) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. సినిమా ట్రైలర్ కూడా ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఇక ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కాస్త భయం కనబడుతోంది. పవన్ కళ్యాణ్ గతంలో చేసిన గ్యాంగ్ స్టర్ తరహా కథలు ఎక్కువగా విజయం సాధించలేదు.
బాలు, పంజా, కొమరం పులి వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ తరహా పాత్రలే దాదాపుగా పోషించారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే వస్తోంది. దీనితో ఈ సినిమా విజయం సాధిస్తుందా అనే భయం మొదలైంది. ఈ సెంటిమెంట్ వెంటాడటంతో ఫ్యాన్స్ సెంటిమెంట్ నిజం కాకూడదని పూజలు చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ మొత్తం ఈ సినిమా పైన ఫోకస్ పెట్టారు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు మరింతగా పెరగడంతో, అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగా జరిగే అవకాశం కనబడుతుంది. అటు విదేశాల్లో కూడా సినిమాకు మంచి క్రేజ్ వస్తోంది. అమెరికా, కెనడా వంటి దేశాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరిగింది. ఈనెల 25న విడుదల కానున్న ఈ సినిమాను సుజిత్ డైరెక్షన్ చేసిన సంగతి తెలిసిందే.