ప్రధాని మోదీతో మస్క్ భేటీ !
ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యేందుకు అమెరికా విద్యుత్తు కార్ల దిగ్గజ సంస్థ టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఈ నెలలో భారత పర్యటనకు విచ్చేయనున్నట్లు తెలుస్తోంది. భారత్లో పెట్టుబడుల ప్రణాళికపై ఆ సమయంలోనే ఆయన తన ప్రణాళిక వెల్లడిరచొచ్చని వివ్వసనీయ వర్గాలు వెల్లడిరచాయి. ఏప్రిల్ 22 నుంచి మస్క్ పర్యటన ప్రారంభం కావొచ్చని, టెస్లా కంపెనీ ఉన్నతాధికారులు కూడా భారత్కు వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ప్రధాని మోదీ కిందటేడాది జూన్లో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు, ఆయన్ను మస్క్ కలిశారు. 2024లో భారత్ పర్యటనకు వచ్చే ఆలోచన ఉందని ఆ సమయంలో ప్రధానికి మస్క్ తెలిపారు. త్వరలోనే టెస్లా కార్లు భారత విపణిలోకి అడుగుపెడతాయనే ఆశాభావాన్ని కూడా అప్పట్లో వ్యక్తం చేశారు.






