భవిష్యత్తు లో డ్రోన్లతోనే : ఎలాన్ మస్క్
ఆధునిక ఫైటర్జెట్ల కంటే డ్రోన్ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని, భవిష్యత్తులో యుద్దాలు డ్రోన్లతోనే జరుగుతాయని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ డోజ్ సంయుక్త సారథులుగా ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలను నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు మస్క్ కృషి చేస్తున్నారు. డ్రోన్ల వినియోగ కాలంలో మానవ సహిత ఫైటర్ జెట్లను వాడటం సరికాదు. ఎందుకంటే అవి పైలట్లను చంపేస్తున్నాయి. అయినా ఇంకా కొంతమంది ఎఫ్`35 వంటి మనుషులు నడిపే యుద్ధ విమానాలను తయారు చేస్తున్నారు. ఆ డిజైన్లు నేటి అవసరాలకు అనుగుణంగా లేవు అని అన్నారు.






