ఆ సంస్థ తమకు చెప్పాల్సిన అవసరం లేదు… జై శంకర్
భారత్లో ఎన్నికల నిర్వహణపై ఐక్యరాజ్య సమితి సీనియర్ అధికారి ఇటీవల చేసిన వ్యాఖ్యలను విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ తోసిపుచ్చారు. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరగాలని ఆ అంతర్జాతీయ సంస్థ తమకు చెప్పాల్సిన అవసరం లేదని దీటుగా బదులిచ్చారు. భారత్లో ప్రజల రాజకీయ, పౌర హక్కులను రక్షణ ఉంటుందని, ప్రతి ఒక్కరూ స్వేచ్చగా, నిష్పక్షపాతంగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని తాము ఆశిస్తున్నామని ఐరాస ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు జైశంకర్ పై విధంగా స్పందించారు. తిరువనంతపురం లోక్సభ స్థానం నుంచి బీజీపీ తరపున పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తరపున ప్రచారం చేసేందుకు ఇక్కడకు వచ్చిన జైశంకర్ మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు.






