India: భారత్‌కు అమెరికా హెచ్చరిక.. చర్చలు విఫలమైతే
డొనాల్డ్ ట్రంప్, పుతిన్ మధ్య అలస్కాలో జరిగే చర్చలు విఫలమైతే భారత్‌పై అదనపు టారిఫ్‌లు విధించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ (Scott Besant) తేల్చి చెప్పారు. ట్రంప్, పుతిన్ (Putin) చర్చల ద్వారా ఫలితంపైనే టారిఫ్‌లపై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ సానుకూల ఫలితాలు రాకపోతే భారత్ (India)పై సుంకాల మోత తప్పదని వెల్లడిరచారు. రష్యా (Russia) నుంచి ముడి చమురు కొంటున్నందుకు ఇండియాపై సెకండరీ టారిఫ్‌లు విధిస్తామన్నారు. అప్పటికీ రష్యా దారికి రాకపోతే సెకెంటరీ టారిఫ్‌లు మరింత పెరుగుతాయని స్పష్టం చేశారు. భారత్ గనుక ముడి చమురు కొనడం ఆపేస్తే రష్యాపై ఒత్తిడి పెరుగుతుందని అమెరికా అంచనా వేస్తోంది. భారత్ ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం ఇప్పటికే 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే.







