Trump: ఆ ముగ్గురితో జాగ్రత్త.. పెంటగాన్ కు ట్రంప్ ఆదేశాలు..

అగ్రరాజ్యం అమెరికాను భయపెట్టే అంశం ఏది…? దీనికి రకరకాల జవాబులు వినిపిస్తాయి. కానీ అవేవీ కాదు…ఆమూడు దేశాలంటే అమెరికాకు ఓరకమైన అసహనం.. అదీకాదు.. మరోవిధమైన ఆందోళన. ఎందుకంటే ఏవీ.. అమెరికా మాటను లక్ష్యపెట్టవు. ఆదేశం ఆదేశాలను చెవికెక్కించుకోవు. అంతేకాదు.. మాజోలికి వస్తే .. సహించే ప్రశ్నేలేదని పరోక్ష, ప్రత్యక్ష హెచ్చరికలు సైతం జారీ చేసే పరిస్థితివాటిది. అవే రష్యా,చైనా, ఉత్తరకొరియా… మరి ఆ మూడు దేశాధినేతలు కలిసికట్టుగా ఒకే వేదికపై కనిపిస్తే… అమెరికా అసహనం.. పీక్స్ కు చేరుతుంది. షాంఘై సదస్సుతో ఇప్పుడు ట్రంప్ (Trump) లో అదే పరిస్థితి కనిపిస్తోంది.
ఎప్పుడైతే యుద్ధం కావాలా.. శాంతి కావాలా అంటూ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ .. పరోక్షంగా చేసిన హెచ్చరికలు .. ట్రంప్ కు ఆగ్రహం తెప్పించాయి. అవసరమైతే చైనా, రష్యాలను అడ్డుకొనేందుకు సిద్ధంగా ఉండాలని పెంటగాన్‌ను ఆయన ఆదేశించారు. అమెరికా సేనల్లో భారీస్థాయిలో మార్పులు చేయాలని సూచించారు. అమెరికా (USA) రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ తనకు ట్రంప్ నుంచి ఈమేరకు ఆదేశాలు వచ్చినట్లు అంగీకరించారు. మిలిటరీలో భారీ పునర్ వ్యవస్థీకరణను చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేమీ యుద్ధం కోరుకుంటూ చేసేది కాదని వివరణ ఇచ్చారు. చైనా, రష్యా మరేదైనా దేశం విషయంలో తమ పాలసీ స్పష్టంగా ఉంటుందని పేర్కొన్నారు.
బీజింగ్‌లో విక్టరీ డే పరేడ్ సందర్భంగా చైనా ఆయుధ ప్రదర్శన అనంతరం ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. చైనా, ఉత్తర కొరియా, రష్యా దేశాలు అమెరికా (USA) కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాయన్నారు. కానీ, అవి ఎటువంటివో మాత్రం ఆయన వెల్లడించలేదు. చైనాను విదేశీ పాలకుల నుంచి విడిపించడంలో అమెరికా (USA) కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఆ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమెరికన్ సైనికులను జిన్‌పింగ్ గుర్తిస్తారా, లేదా అనేది పెద్ద ప్రశ్న అని ట్రంప్ పేర్కొన్నారు.