Cricket: భారత జట్టులో విభేదాలు..?

భారత క్రికెట్ జట్టులో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయా..? అంటే అవుననే అంటున్నాయి భారత క్రికెట్ వర్గాలు. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకునే విషయంలో జట్టులో భిన్నాభిప్రాయాలు వినిపించాయి వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వాళ్ళిద్దరూ తప్పుకోవడాన్ని ఏమాత్రం అంగీకరించలేదని సమాచారం. అలాగే కేఎల్ రాహుల్ కూడా ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.
అటు స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కూడా ఈ విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో విభేదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరిని వన్డే క్రికెట్ నుంచి కూడా తప్పించే అవకాశం ఉండటంతో, జట్టులోని సీనియర్ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను బోర్డు పెద్దలకు తెలిపినట్లు సమాచారం. అభిమానుల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని, కొందరు ఆటగాళ్లు గంభీర్ వద్ద అభిప్రాయ పడినట్లుగా తెలుస్తోంది. గంభీర్ కారణంగానే వాళ్ళిద్దరూ టెస్ట్ క్రికెట్ జట్టు నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది.
ఈ విషయంలో గంభీర్ తో రిషబ్ పంత్ పూర్తిగా వ్యతిరేకించినట్లు సమాచారం. ఇటీవల టీమిండియా మాజీ క్రికెటర్ ఒకరు మాట్లాడుతూ, రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జట్టు నుంచి తప్పుకోవడానికి అంగీకరిస్తేనే రిషబ్ పంత్ కు కెప్టెన్సీ ఇస్తామని బోర్డు పెద్దలు చెప్పారని, అందుకు పంత్ అంగీకరించలేదని వెల్లడించాడు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరిని వన్డే క్రికెట్ నుంచి తప్పించే విషయంలో పంత్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అటు బోర్డు పెద్దలు కూడా ఈ విషయంలో గంభీర్ తో విభేదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ లో ఆస్ట్రేలియాలో సిరీస్ ఆడనుంది టీమిండియా. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తప్పుకునే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాత్రం వాళ్ళిద్దరూ వచ్చే వరల్డ్ కప్ వరకు ఆడతారని స్పష్టం చేశారు.