Daniil Medvedev:టెన్నీస్ క్రీడాకారుడు మెద్వెదేవ్‌కు జరిమానా

యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రష్యా స్టార్ టెన్నిస్ క్రీడాకారుడు డానియెల్ మెద్వెదేవ్ (Daniil Medvedev) జరిమానాకు గురయ్యాడు. ఫ్రాన్స్ (France) కు చెందిన అన్‌సీడెడ్ ఆటగాడు బెంజమిన్ (Benjamin) చేతిలో తొలరౌండ్‌లో అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. దీంతో గ్రౌండ్‌లోనే తన రాకెట్‌ను విరగగొట్టాడు. అతని అనుచిత ప్రవర్తనకు గ్రాండ్‌స్లామ్ నిర్వాహకులు ఏకంగా 42,500 డాలర్ల ( భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.37 లక్షలు) జరిమానా విధించారు. కోర్టు (Court) లో అనుచిత ప్రవర్తించినందుకు గాను ఈ జరిమానా(Fine) విధిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో మెద్వెదెవ్ 3-6, 5-7, 7-7(7-5), 6-0, 4-6 తేడాతో ఫ్రాన్స్ ప్లేయర్ బెంజమిన్ బోంజి చేతిలో ఓటమి పాలయ్యాడు.