Bejing: రోబో సరోగసీ.. చైనీయుల అద్భుత సృష్టి…

చైనా (China) ఆధునికత, శాస్త్ర సాంకేతికత విషయంలో దూసుకెళ్తోంది. ఓ వైపు త్రీగోర్జెస్ లాంటిడ్యామ్స్.. మరోవైపు.. ఏకంగా సూర్యుడి స్థాయిలో వెలుగు అందించే ప్రాజెక్టు.. ఇప్పుడు ఏకంగా రోబో సరోగసికి శ్రీకారం చుట్టింది. దీని వల్ల ఇక సరోగసికి మరో మహిళ అవసరం ఉండదు. ఏకంగా ఓ రోబోనే మహిళ పాత్ర పోషిస్తుంది. ఫలితంగా సరోగసి మరింత సులభతరం కానుంది. ఈప్రక్రియ నెమ్మదిగా అన్ని దేశాలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
సరోగసి… బాగా ఖర్చుతో కూడుకున్న పని. పైగా ఇండియాలో వాణిజ్య సరోగసి బ్యాన్‌లో ఉంది. చైనా ప్రయోగం సక్సెస్ అయితే మాత్రం సరోగసి కోసం వేరే మహిళలు అవసరం లేదు. రోబోలే మనుషుల పిల్లల్ని కంటాయి. చైనాకు చెందిన కైవా టెక్నాలజీ ఈ అద్భుత సృష్టికి తెరతీసింది. రోబోలు మనుషుల పిల్లల్ని ఎలా కంటాయన్న అనుమానం అక్కర్లేదు. ఆ రోబోల్లో కృత్తిమ గర్భాశయాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో అండం వృద్ధి చెందుతుంది. 9 నెలల తర్వాత బయటకు వస్తుంది.
రోబో గర్భంలో బిడ్డ పెరుగుతున్నంత వరకు పైపు ద్వారా పోషకాలను అందిస్తారు. ఈ ప్రోటోటైప్ వచ్చే ఏడాది మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రెగ్నెన్సీ రోబోల ధర లక్ష యూవాన్లు. అదే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 11 లక్షల రూపాయలుపైనే ఉంటుంది. కైవా టెక్నాలజీ అధినేత డాక్టర్ హాంగ్ కీఫెంగ్ మాట్లాడుతూ.. ‘కృత్తిమ గర్భాశయం తయారీ ఇప్పటికే పూర్తయింది. దాన్ని రోబో కడుపులో అమర్చి పరీక్ష చేయటం మాత్రమే బాకీ ఉంది. ఇకపై మనుషులు, రోబోలు కలిసి పిల్లల్ని కనొచ్చు. న్యాయ పరమైన, సమాజపరమైన సమస్యలకు సంబంధించి ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతున్నాము’ అని అన్నారు.
నిజంగా ఇది పూర్తిస్థాయిలో విజయవంతమైతే.. చైనా కంపెనీకి కాసుల వర్షం కురిపిస్తుంది. అదే సమయంలో పిల్లలు లేని తల్లితండ్రులకు మరింత వెసులు బాటు కలగనుంది. దీని ద్వారా ఏ అద్దె గర్భం అవసరం లేదు. మహిళల గర్భాలను కమర్షియల్ చేయాల్సిన అవసరం రాదు. ఓ విధంగా చెప్పాలంటే డబ్బుంటే చాలు.. పిల్లల్ని కనడం ఈజీగా మారనుంది. అయితే దీనికి అంతర్జాతీయ సమాజం,ప్రపంచ దేశాలు.. మతాధిపతులు ఎలా స్పందిస్తారన్నది కీలక అంశం కానుంది.