India: భారత్‌పై అమెరికా సుంకాలను వ్యతిరేకిస్తున్నాం : చైనా

భారత్‌పై అమెరికా సుంకాల పెంపును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చైనా (China ) పేర్కొంది. వాణిజ్య, సుంకాల యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని ఆరోపించింది. ఢల్లీిలో నిర్వహించిన కార్యక్రమంలో భాతర్‌లోని చైనా రాయబారి జు ఫీహాంగ్ (Feihong) ఈ మేరకు వ్యాఖ్యానించారు. స్వేచ్ఛా వాణిజ్యం వల్ల ఎంతో ప్రయోజనం పొందిన అమెరికా (America) ఇపుడు ఆయా దేశాలపై సుంకాలను ప్రయోగిస్తోంది. భారత్‌పై 50 శాతం మేర సుంకాలు విధించింది. వాటిని మరింత పెంచుతామని హెచ్చరిస్తోంది. వీటిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ వ్యవహారంలో భారత్ వెన్నంటి నిలుస్తాం అని ఫీహాంగ్ పేర్కొన్నారు.