అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. నిందితుడితో పాటు మరో నలుగురు అధికారులు
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్‌లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు ఓ దుండగుడు. ఈ అనూహ్య దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా యూఎస్ మార్షల్స్ టాస్క్ ఫోర్స్‌కు చెందిన అధికారులు. అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నాడన్న కారణంతో వారెంటును అందించేందుకు కొంతమంది అధికారులు ఓ నిందితుడి ఇంటికి వెళ్లారు. వీరి రాకను గమనించిన నిందితుడు దాడికి దిగడంతో మూడు గంటలపాటు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నిందితుడితో పాటు మరో నలుగురు అధికారులు మృతి చెందారు. అనంతరం ఆ ఇంటిలో నివసిస్తున్న ఓ మహిళ, 17 ఏళ్ల యుకుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరో రైఫిల్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు.






