Netanyahu: ట్రంప్ తో ఎలా డీల్ చేయాలో మోదీకి చెబుతా : నెతన్యాహు

అమెరికా దిగుమతి చేసుకునే భారత ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించిన ఆయన, రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు ఆపకపోతే వీటిని మరింత పెంచుతామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడితో ఎలా డీల్ చేయాలో ప్రధాని మోదీ (Modi)కి కొన్ని సలహాలు ఇస్తానని అన్నారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్, ఇద్దరు నాకు ప్రియమిత్రులే. ట్రంప్‌తో వ్యవహరించే విషయంలో మోదీకి కొన్ని సలహాలు ఇస్తా. అయితే ఆ విషయాన్ని వ్యక్తిగతంగా మాత్రమే చెబుతా అని నెతన్యాహు పేర్కొన్నారు. త్వరలోనే భారత్ (India) లో పర్యటించాలన్న తన ఆసక్తిని వ్యక్తపరిచారు.