భారత్ పర్యటన్కు మరోసారి బ్రిటన్ రాజ దంపతులు
బ్రిటన్ రాజు చార్లెస్-3, కెమిల్లా దంపతులు మరోసారి భారత్ రానున్నారు. 2025 ప్రారంభంలో వారు భారత్‌లో పర్యటించనున్నారు. బ్రిటన్ విదేశాంగ కార్యాలయానికి వారు ఈ మేరకు సమచారామిచ్చారు. సింహాసనాన్ని అధిష్టించాక చార్లెస్`3కు భారత్‌లో ఇదే తొలి అధికారిక పర్యటన కానుంది. 2019లో యువరాజు హోదాలో ఆయన భారత్‌లో చివరిసారి అధికారికంగా పర్యటించారు. గత అక్టోబర్‌లో రాజ దంపతులు బెంగళూరులో పర్యటించినా అది పూర్తిగా వ్యక్తిగతంగా సాగింది. గత ఫిబ్రవరిలో చార్లెస్‌కు కేన్సర్ నిర్ధారణ అయినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ వెల్లడిరచింది. అందులో చికిత్సలో భాగంగా వారు భారత్ వచ్చినట్లు తెలిసింది. బెంగళూరులో వెల్నెస్ రీట్రీట్‌లో రాజు దంపతులు నాలుగు రోజులు గడిపారు. వారిద్దరూ 2022లోనే భారత్‌లో పర్యటించాల్సింది. క్వీన్ ఎలిజబెత్`2 మరణంతో ఆ పర్యటన రద్దయిన సంగతి తెలిసిందే.






