బ్రిటన్ శుభవార్త .. విదేశీ భర్తలు, భార్యలకు
బ్రిటిష్ పౌరులను పెళ్లి చేసుకున్న విదేశీయులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని వలస, పౌరసత్వ వ్యవహారాల మంత్రి సీమా మల్హోత్రా పార్లమెంటులో ప్రకటించారు. బ్రిటన్ పౌరుడినిగానీ, పౌరురాలినిగానీ పెళ్లాడిన విదేశీయులు తమ జీవిత భాగస్వాములు చనిపోయిన తర్వాత అక్కడే స్థిరపడ్డాలంటే చెల్లించాల్సిన 2,885 పౌండ్ల రుసుమును అక్టోబరు 9 నుంచి ఎత్తి వేస్తున్నట్లు తెలిపారు. బ్రిటిష్ భర్త, భార్య చనిపోయాక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విదేశీయులకు, వారి సంతానికి ఇది ఎంతో ఊరటనివ్వనుంది. ముఖ్యంగా గూర్ఖాలకు, హాంకాంగ్ సైన్యంలో సభ్యులుగా ఉన్నవారికీ ఇది శుభవార్తే.






