10 నిమిషాల యాత్ర కోసం… రూ.205 కోట్లు

మావన సహిత అంతరిక్ష ప్రయాణాలను మరింత సులువు చేయడం కోసం స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ లాంటి దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్న విషయం అందరికి తెలిసిందే. స్పేస్ ఎక్స్ సంస్థ ఇప్పటికే అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి మానవ సహిత అంతరిక్ష యాత్రలను దిగ్విజంగా పూర్తి చేస్తోంది. కేవలం అతంటితో ఆగకుండా అంగారక గ్రహంపై కాలనీలు ఏర్పాటు చేయాలని కూడా చూస్తుంది. ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఇప్పటికే ఆ దిశగా అంతరిక్షనౌక ప్రయోగాలపై దృష్టి సారించింది. ఇది ఇలా ఉంటే మావన సహిత అంతరిక్ష ప్రయోగాల్లో జెఫ్ బెజోస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ సంస్థ కూడా కీలక ఘట్టానికి చేరుకుంది. బ్లూ ఆరిజన్ తన తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాన్ని నిర్వహించడానికి సిద్ధమైంది.
ఈ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రలో ఆస్ట్రోనాట్స్ తో పాటు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, అతని సోదరుడు మార్క్ బెజోస్‍తో కలిసి ప్రయాణించవనున్నాడు. అయితే తాజాగా జెఫ్ బెజోస్ కలిసి అంతరిక్ష యాత్ర చేయడానికి మరో సీట్ కోసం ఒక ప్రత్యక్ష వేలం జరిగింది. ఈ ప్రత్యక్ష వేలం ప్రారంభమైన నాలుగు నిమిషాల్లో బిడ్లు 20 మిలియన్ల డాలర్లకు పైగా కోట్ చేశారు. చివరికీ కేవలం ప్రారంభమైన 7 నిమిషాల తర్వాత 28 మిలియణ్ డాలర్ల (రూ.205 కోట్ల)తో బిడ్డింగ్ ముగిసింది. అయితే అంత మొత్తం వేలం వేసిన అతని పేరును సంస్థ బయటికి వెల్లడించలేదు.