వెనక్కి తగ్గకుండే ఇజ్రాయెల్ ..ఏకాకి అవుతుంది : బ్లింకెన్ హెచ్చరిక
గాజా స్ట్రిప్‌లో దాడులు కొనసాగిస్తే అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఏకాకి అవుతుందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అమెరికా మంత్రి ఆంటోనియో బ్లింకెన్ హెచ్చరించారు. పశ్చిమాసియాలో శాంతి మిషన్ సందర్భంగా ఆయన నెతన్యాహుతో ముఖాముఖి భేటీ అయ్యారు. పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దాడుల గురించి చర్చించారు. అనంతరం బ్లింకెన్ మీడియాతో మాట్లాడుతూ హమాస్‌ను ఓడించాలనే లక్ష్యం సరైనదే, అందుకు ఇజ్రాయెల్‌కు మా సమర్థన ఉంది కానీ రపాపై భీకర దాడులు చేయడమే ఇందుకు మార్గమంటే ఒప్పుకోమని బ్లింకెన్ అన్నారు. భూతల దాడులను తీవ్రతరం చేయడం వల్ల అమాయక పౌరులు చనిపోతున్నారని, మానవతా సహాయానికి, భద్రతకు విఘాతం కలుగుతుందని, ప్రపంచ దేశాలు ఇజ్రాయిల్‌ను ఏకాకి చేస్తామని వెల్లడించారు.






