తప్పు చేస్తున్నారు ఆయన వైఖరిని… నేను అంగీకరించను : బైడెన్
హమాస్ యుద్దం మొదలుపెట్టినప్పటి నుంచి ఇజ్రాయెల్ తొలిసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. నెతన్యాహూ గాజాలో తప్పు చేస్తున్నారు. ఆయన వైఖరిని నేను అంగీకరించను. ఆరు లేదా ఎనిమిది వారాలపాటు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని నేను ఇజ్రాయెలీలను కోరుతున్నాం. ఈ సమయంలో శరణార్థులకు ఆహారం, ఔషధాలను సరఫరా చేయొచ్చు అని అన్నారు. గత వారం జరిగిన డ్రోన్ దాడిలో అమెరికాకు చెందిన ఎన్జీవో సంస్థలో పనిచేస్తున్న ఏడుగురు మరణించారు. ఈ ఘటనపై అగ్రరాజ్యం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. జోర్డాన్, సౌదీ, ఈజిప్ట్ దేశాలు కూడా సహాయం, ఆహారం పంపేలా నిత్యం వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు బైడెన్ తెలిపారు. వారు కూడా దీనికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గాజాలోని ప్రజలకు ఔషధాలు, ఆహార సరఫరాలో ఎటువంటి రాజీ ఉండదని తెలిపారు.






