రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భూటాన్ ప్రధానమంతి భేటీ
భూటాన్‌తో భాగస్వామ్యాన్ని భారతదేశం చాలా విలువైందిగా భావిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాష్ట్రపతి ముర్ముతో భూటాన్ ప్రధానమంత్రి దాషో షెరింగ్ తోబ్గే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ఇంధన సహకారం, ప్రజల మధ్య సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడి వంటి విషయాలలో భూటాన్‌తో భాగస్వామ్యం కావడం సంతోషమని ముర్ము పేర్కొన్నారు. తమ దేశ అభివృద్ధిలో భారత్‌ది విశ్వసనీయమైన పాత్ర అని భూటాన్ ప్రధాని తోబ్గే పేర్కొన్నారు. భారత పర్యటనలో ఉన్న తోబ్గే ప్రధాని మోదీతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భూటాన్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీని తోబ్గే ఆహ్వానించారు. వచ్చే వారం మోదీ భూటాన్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నారు.






