Sam Pitroda: పాక్‌లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంది: సామ్ పిట్రోడా కామెంట్స్ వైరల్

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా (Sam Pitroda) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ను సందర్శించినప్పుడు తనకు సొంత ఇంట్లో ఉన్నట్లు అనిపించిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బంగ్లాదేశ్, నేపాల్‌లకు వెళ్లినప్పుడు కూడా ఇదే అనుభూతి కలిగిందని తెలిపారు. “వారు నాలాగే కనిపిస్తారు, నాలానే మాట్లాడతారు. వారు నా పాటలను ఇష్టపడతారు, నా ఆహారాన్ని తింటారు” అని ఆయన (Sam Pitroda) అన్నారు.
భారత్ తన విదేశాంగ విధానంలో భాగంగా పాకిస్తాన్‌తో సహా పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాలని పిట్రోడా పిలుపునిచ్చారు. హింస, ఉగ్రవాదం వంటి సమస్యలు ఉన్నప్పటికీ, పొరుగు దేశాలతో చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన (Sam Pitroda) కోరారు.
పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ (BJP) తీవ్రంగా స్పందించింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి మాట్లాడుతూ.. 26/11 దాడుల తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాక్‌పై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడంలో ఆశ్చర్యం లేదని విమర్శించారు. ఈ విమర్శల నేపథ్యంలో పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. పొరుగు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి చరిత్ర, సంబంధాలను నొక్కి చెప్పడమే తన ఉద్దేశమని, బాధ్యతాయుతమైన విదేశాంగ విధానమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.