భారత సిబ్బందిపై జో బైడెన్ ప్రశంసలు
నౌక ఢీకొనడంతో పటాప్స్కో నదిపై ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. సహాయక సిబ్బంది, నౌకలో ఉన్న భారత సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. షిప్ తమ నియంత్రణ కోల్పోయిందని గుర్తించిన సిబ్బంది తక్షణమే స్పందించి, మేరిలాండ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీని అప్రమత్తం చేశారు. దాంతో స్థానిక అధికారులు వంతెనపై రాకపోకలను ఆపివేయగలిగారు. వారి అప్రమత్తత ఎన్నో ప్రాణాలను కాపాడిరది అని జైడెన్ వెల్లడించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అత్యవసర పరిస్థితిలో అన్ని వనరులను అందుబాటులో ఉంచామన్నారు. తమ ప్రభుత్వం వంతెన పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.






