Hindu Temple: అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

అమెరికాలోని హిందూ ఆలయం (Hindu Temple)పై వేర్పాటువాదులు మరోసారి దాడికి పాల్పడ్డారు. ఇండియానా రాష్ట్రం జాన్సన్ కౌంటీలోని అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ ఆలయం (Swaminarayan Temple)పై ఖలిస్థాన్ వేర్పాటువాదులు దాడికి పాల్పడినట్లు ది హిందూ అమెరికన్ పౌండేషన్ (The Hindu American Foundation )తెలిపింది. ఖలిస్థాన్(Khalistan)కు మద్దతుగా, భారత్‌కు వ్యతిరేకంగా దేవాలయంపై పలు ద్వేషపూరిత నినాదాలు రాశారని వెల్లడిరచింది. భక్తుల మనోభావాలు దెబ్బతిసే ఇటువంటి విధ్వంసాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలో అమెరికాలోని హిందూ దేవాలయాలపై ఇది నాలుగో దాడిగా నిర్వాహకులు పేర్కొన్నారు. మళ్లీ ఇటువంటి దాడులు జరగకుండా ఆలయ వద్ద భద్రత ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేశామని స్థానిక పోలీసులు వెల్లడిరచారు. ఘటన వెనుక భారత వ్యతిరేక శక్తుల హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.