చైనాకు మరోసారి భారత్ కౌంటర్…
అరుణాచల్ ప్రదేశ్ పై చైనా మొండి వాదనలు మానడం లేదు. దక్షిణ టిబెట్ (జాంగ్నాన్) తమ భూభాగంలోనిదేనని ఆ దేశ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ కర్నల్ రaాంగ్ షియాంగాంగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీన్ని భారత్ తాజాగా తిప్పికొట్టింది. అరుణాచల్ తమ దేశంలో విడదీయరాని భాగమని, నిరాధార వాదనలను వల్లె వేయడం ద్వారా వాస్తవాలు మారిపోవని డ్రాగన్‌కు మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్‌ను చైనా జాంగ్నాన్గా పేర్కొంటోంది. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా రక్షణ శాఖ ప్రతినిధి చేసిన అసంబద్ధ వ్యాఖ్యలను గమనించాం. ఈ వ్యవహారంలో నిరాధార వాదనలను పునరావృతం చేయడం ద్వారా, అవి వాస్తవాలుగా మారిపోవు. ఆ ప్రాంతం ఎల్లపుడూ మా దేశంలో అంతర్భాగం. మా అభివద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో అక్కడ పౌరులు ప్రయోజనం పొందుతూనే ఉంటారు అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు.






