H1B Visa: యూఎస్ ఆంక్షల వేళ.. హెచ్1బీ వీసాదారులపై కెనడా కన్ను!
అమెరికాలో వలసలపై ఆంక్షలు పెరుగుతున్న తరుణంలో, కెనడా ప్రభుత్వం (Canada Government) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల (Foreign Students) సంఖ్యను 25-32 శాతం వరకు తగ్గించాలని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో నైపుణ్యాలున్న పరిశోధకులు, నిపుణులు, ముఖ్యంగా అమెరికాలోని హెచ్1బీ (H1B Visa) వీసాదారులు కెనడాలో స్థిరపడే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ లక్ష్యం కోసం తన తొలి బడ్జెట్లో రూ.106 కోట్లతో అంతర్జాతీయ ట్యాలెంట్‌ను ఆకర్షించే పథకాన్ని కార్నీ (PM Mark Carney) ప్రతిపాదించారు.
ఇలా చేయడం ద్వారా వేలాది మంది అంతర్జాతీయ నిపుణులు కెనడాకు వలస వచ్చి, గ్లోబల్ మార్కెట్లో కెనడా పోటీతత్వం పెరుగుతుందని కార్నీ సర్కారు భావిస్తోంది. విదేశీ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో, విద్యార్థుల సంఖ్యను తగ్గించి, నిపుణులను పెంచడం ద్వారా భవిష్యత్తులో కెనడా ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని కార్నీ సర్కారు (PM Mark Carney) ఆశిస్తోంది.







