India: భారత్ కు అమెరికన్ మహిళ ఫిదా, కానీ..

భారత్ లో పర్యటించే పర్యాటకులు ఇక్కడి ఎన్నో విషయాలను, తమ అనుభవాలను బయట ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు. ఎన్నో పర్యాటక(Tourist places in India) ప్రదేశాలున్న ఉప ఖండం పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఇలా భారత్ కు వచ్చిన ఓ అమెరికన్(America) మహిళ తన అనుభవాలను వెల్లడించింది. తాను భారత్ ను ఎంతగానో ఇష్టపడుతున్నాను అని, భారత్ లో నివసించడం బాగుందని, కాని తనకు నచ్చని ఎన్నో విషయాలు ఉన్నాయని తెలిపింది భారత పర్యటనలో ఉన్న క్రిస్టెన్ ఫిషర్.
ప్రపంచంలో ఏ దేశం కూడా పరిపూర్ణంగా ఉండదు అని, భారత్ కూడా అంతేనన్న ఆమె వ్యక్తులు తమ ఆనందాన్ని తామే వెతుక్కోవాలని సూచించింది. నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను కానీ… అసహ్యించుకునే విషయాలు కొన్ని ఉన్నట్టు పేర్కొంది. ఎన్నో లోపాలు ఉన్నాయని, అమెరికాలో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయని, అమెరికా కూడా ఇతరులు ఊహించినంత పరిపూర్ణంగా లేదని వెల్లడించింది. మనం ఎక్కడికి వెళ్ళినా కొన్ని లోపాలు ఉంటాయని, ఏది ఏమైనా, దానిలోని మంచిని చూడటం నేర్చుకోవడం చేయాలని ఆమె చెప్పుకొచ్చింది.
మనం ఎక్కడ ఉన్నా మన స్వంత ఆనందాన్ని సృష్టించుకునే శక్తి మనకు ఉందని నేను నమ్ముతున్నానని కామెంట్ చేసింది. ఆమెకు భారత్ లో ఏం నచ్చాయో, ఏవి నచ్చలేదో వివరించింది. నా కుటుంబాన్ని మిస్ అవుతున్నాను, నాకు భారత ఆహారం ఇష్టం. నాకు మైనారిటీగా ఉండటం ఇష్టం, నాకు ఢిల్లీ కాలుష్యం అంటే ఇష్టం లేదు, పిల్లలకు భారత్ మంచి ప్రదేశం, శాఖాహారిగా ఉండటం మంచిదని నేను అనుకుంటున్నాను, భారత్ నిరాడంబర దేశం, నాకు వీధుల్లో చెత్త అంటే ఇష్టం లేదు, భారత ఆహారం ఆరోగ్యకరమైనది, భారత్ లో ఆతిధ్యం చాలా బాగుంది, స్థానిక వ్యవసాయం నచ్చిందని ఆమె కామెంట్ చేసింది.