Kerala: కేరళ అమ్మాయి, అమెరికా అబ్బాయి.. ఫ్రాన్స్ కలిపింది ఇద్దరిని

అమ్మాయిది కేరళ(Kerala), అబ్బాయిది అమెరికా(America) . ఇద్దరికి ఫ్రాన్స్‌లో పరిచయం ఏర్పడిరది. ఇది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే ఖండాలు దాటొచ్చిన అతడు. కొచ్చిలో ఆమెను వివాహమాడాడు. ఓనం పండగ ఆనందాన్ని రెట్టింపు చేశాడు. ఫోర్ట్ కొచ్చికి చెందిన అంజలి (Anjali) మూడేళ్ల క్రితం ఫ్రాన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో అమెరికాకు చెందిన రాబర్ట్ వెల్స్ (Robert Wells) పరిచయమయ్యాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మనసులు కలిశాయి. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. ఓనం పండగ(Onam festival ) వేళ అంజలి స్వస్థలానికి వచ్చిన రాబర్ట్ స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్నాడు. స్వయగా అందరికి మిఠాయిలు పంచిపెట్టాడు.