Alaska: అలాస్కా వ్యక్తికి … పుతిన్ అదిరే గిఫ్ట్

రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతవారం జరిపిన శిఖరాగ్ర సమావేశం సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అలాస్కా (Alaska)కు చెందిన ఓ వ్యక్తికి రూ.19 లక్షల విలువైన బైక్ (Bike)ను పుతిన్(Putin) బహుమతిగా ఇచ్చారు. రష్యాలో తయారైన ఉరల్ బైక్‌ను అతడు వాడుతుండటమే అందుకు కారణం. ఈ ఊహించని పరిణామానికి ఆ వ్యక్తి ఆనందంలో మునిగిపోయాడు. ట్రంప్, పుతిన్‌ల భేటీకి వారం ముందే యాంకరేజ్‌కు చేరుకున్న రష్యన్ మీడియా ప్రతినిధులు స్థానికులతో ముచ్చటించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఉరల్ కంపెనీకి చెందిన ఓ పాత బైక్ వాడుతున్న మార్క్ వారెన్ అనే విశ్రాంత అగ్నిమాక ఇన్‌స్పెక్టర్ వారెన్, రష్యా జర్నలిస్టుల కంటపడ్డాడు. ఈ బైక్ అంటే తనకు చాలా ఇష్టమని, యుద్ధం నేపథ్యంలో ఆ విడిభాగాలు దొరకట్లేదని, దీంతో నిర్వహణ కష్టంగా మారిందని వాపోయాడు. ఇందుకు సంబంధించిన వార్త రష్యాలో వైరల్‌గా మారింది. క్రెమ్లిన్ దృష్టికీ వెళ్లింది. దీంతో స్పందించిన రష్యా అధికారులు.. వారెన్‌కు ఫోన్ చేసిన బైక్ గురించి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. పుతిన్ వచ్చిన విమానంలోనే కొత్త బైక్‌ను తీసుకొచ్చి, అమెరికా అధికారుల సాయంతో స్థానిక ఎంబసీ (Embassy) కి తరలించారు. భేటీ ముగిసిన మరుసటి రోజు దీనిని వారెన్‌కు అప్పగించారు. పాత బైక్ అంటే ఇష్టం. అయినప్పటికీ కొత్తది చాలా అద్భుతంగా ఉంది. మాటలు రావడం లేదు అని వారెన్ పేర్కొన్నాడు. ధన్యవాదాలు తెలుపుతూ పుతిన్‌కు త్వరలోనే లేఖ రాస్తానన్నాడు.