Fort Stewart : అమెరికా సైనిక స్థావరంలో కలకలం

అమెరికాలోని జార్జియా (Georgia) రాష్ట్రంలో అతిపెద్ద సైనిక స్థావరమైన ఫోర్ట్ స్టెవార్ట్ (Fort Stewart) లో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని గంటలోపే అదుపులోకి తీసుకున్నట్టు సైన్యం (Army) ప్రకటించింది. ఈ కాల్పుల ఘటన ఉదయం 10:56కు చోటచేసుకుంది. కాల్పులు జరిపిన వ్యక్తి రెండో ఆర్మర్డ్ బ్రిగేడ్ కంబాట్ టీమ్ ఉండే ప్రాంతంలో ప్రత్యక్షమయ్యాడు. ఈ ఘటనపై జార్జియా రాష్ట్ర గవర్నర్ బ్రియాన్ కెంప్ (Brian Kemp) దిగ్భ్రాంతిని, ఆవేదనను వ్యక్తం చేశారు.