Venus Williams : వీనస్ విలియమ్స్..45 ఏళ్ల వయసులోనూ రికార్డు

యూఎస్ ఓపెన్ సింగిల్స్ వైల్డ్‌కార్డ్ అందుకొన్న ప్లేయర్‌గా అమెరికా వెటరన్ వీనస్ విలియమ్స్ (Venus Williams) (45) రికార్డులకెక్కింది. ఈ నెల 24 నుంచి జరగనున్న యూఎస్ ఓపెన్ (US Open )కు సంబంధించిన వైల్డ్‌కార్డ్ ఎంట్రీలను నిర్వాహకులు ప్రకటించారు. రెండేళ్ల విరామం తర్వాత వీనస్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో 1981లో రెనీ రిచర్డ్స్ (Renee Richards) (47) తర్వాత సింగిల్స్ వైల్డ్‌కార్డ్ (Wildcard) అందుకొన్న పెద్ద వయసు ప్లేయర్‌గా విలియమ్స్ నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో భారత సంతతికి చెందిన అమెరికా ఆటగాడు నిశేష్ బసవారెడ్డి (Nisesh Basava Reddy) (20)కి కూడా వైల్డ్‌కార్డ్ లభించింది. నెల్లూరు జిల్లాకు చెందిన నిశేష్ తండ్రి…మురళీకృష్ణ 1999లో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.