మరో 45 మంది భారతీయులకు విముక్తి
రష్యా సైన్యంలో చేరిన భారతీయులకు ఊరట లభించింది. ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్దంలో పాల్గొంటున్న వారికి విముక్తి కలిగింది. యుద్ధభూమిలో ఉన్నవారిని రష్యా సైన్యం విడుదల చేసింది. ప్రస్తుతం 45 మంది విడుదలయ్యారు. మరో 50 మందిని కూడా వెనక్కి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇటీవల రష్యాలో పర్యటించిన భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వద్ద ప్రస్తావించడం గమనార్హం. వారిని సైన్యం నుంచి విడుదల చేస్తామని పుతిన్ హామీ ఇచ్చారు కూడా.






