కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత కూడా మనం చాలా కాలం కరోనా వైరస్‌తో కలిసి సహజీవనం చేయాల్సి ఉంటుందని భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎంతో మంది ప్రముఖులు కూడా అభిప్రాయపడ్డారు. చాలా కాలం పాటు సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు వాడటం నిత్యవసరంగా మారనున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తోన్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనపై మంత్రులందరూ సమీక్షించి తమ అభిప్రాయాలను తెలపాలని కేంద్రం కోరింది. దీనికి సంబంధించిన పేపర్లను ఆయా శాఖలకు పంపించింది.
ఈ పాలసీ ప్రకారం ఇంటి నుంచి పనిచేయడానికి అవకాశం ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంవత్సరంలో 15 రోజుల వరకు వర్క్‌ఫ్రం హోం చేసే అవకాశాలు ఉన్నట్టు ఆ డ్రాఫ్ట్ పేపర్ల ద్వారా తెలుస్తోంది. మొత్తం మనదేశంలో 48.34 లక్షల మంది కేందప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. దీనికి సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌ను మంత్రులు, సంబంధిత అధికారులు మే 21లోగా అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు భారతదేశంలో 78,000 లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 2,549 మంది చనిపోయారు. 26,000 మంది కోలుకున్నారు.






