అలా చేస్తే కరోనా సోకే ఛాన్స్ తక్కువ!
కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో యోగా సాధన ఎంతో మేలు చేస్తుందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ అన్నారు. యోగా సాధన చేసేవాళ్లకు కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గోవాలో ఆయన మాట్లాడుతూ దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో యోగాపై చేసిన ప్రచారం కరోనాపై పోరులో బాగా ఉపయోగపడిందని చెప్పారు. యోగా సాధన చేసేవాళ్లకు కరోనా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం తక్కువగా ఉంటుంది అని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఆయన గోవాలోని తన నివాసంలో యోగాసానాలు వేశారు. యోగాసనాలతో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా శ్వాసకోశ వ్యవస్థ బలోపేతమై కొవిడ్లాంటి వైరస్లను నియంత్రిస్తాయని తెలిపారు.






