టెన్త్, ఇంటర్ పరీక్షలపై కీలక ప్రకటన చేసిన కేంద్రం
లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించుకునేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతినిచ్చింది. పెద్ద సంఖ్యలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా వెల్లడించారు. అయితే భౌతిక దూరం, ఫేస్ మాస్క్ తప్పనిసరి అని సృష్టం చేశారు. అయితే కంటైన్మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయకూడదని రాష్ట్రాలకు కేంద్రం సృష్టం చేసింది. టీచర్లు, సిబ్బంది, విద్యార్థులు ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని నిబంధన పెట్టింది. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఈ నిర్ణయాన్ని సంబంధించి కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు సీఎస్‌లకు లేఖ రాశారు.






