25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం
దేశీయ విమాన సర్వీసులు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా కట్టడికి మార్చి 25న దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ అనంతరం సుదీర్ఘ విరామం తర్వాత విమానాల రాకపోకలు ప్రారంభమవనున్నాయి. అన్ని ఎయిర్‌లైన్స్‌కు ఈ మేరకు పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక దేశీయ విమాన సర్వీసులు ప్రారంభానికి పౌర విమానయాన శాఖతో పాటు ఎయిర్పోర్టస్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని ఏర్పాట్లూ చేపట్టాయి. భౌతిక దూరం పాటించడం, ప్రయాణికులు విధిగా మాస్క్‌లు ధరించడం వంటి కోవిడ్ 19 నిబంధనల అమలుతో దేశీయ విమాన సర్వీసులను ప్రభుత్వం అనుమతించింది.






