మే 31 వరకు లాక్డౌన్ పొడిగింపు
దేశవ్యాప్త లాక్డౌన్ను మే 31 వరకు కేంద్రం పొడిగించింది. నేటితో మూడో విడత లాక్డౌన్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ 4.0 నిబంధనలను జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఎన్ఈసీ) వెల్లడిస్తుందని తెలిపింది. అప్పటి వరకు ప్రస్తుత నిబంధనలే అమల్లో ఉంటాయని ఎన్డీఎంఏ పేర్కొంది. ఇటీవల జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసగించినప్పుడు లాక్డౌన్ను మరోసారి పొడిగిస్తున్నట్లు ప్రకటన చేశారు. 18 తర్వాత కూడా లాక్డౌన్ ఉంటుందని చెప్పారు. అయితే ఏ తేదీ వరకు అనేది వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఎన్డీఎంఏ ప్రకటించింది. రైలు, విమాన, మెట్రో సర్వీసులపై మే 31 వరకు నిషేధం కొనసాగుతుందని సృష్టం చేసింది. అదే సమయంలో కంటైన్మెంట్ జోన్ల మినహా అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే రాష్ట్రాల పరస్పర అంగీకారంతో వీటిని నడుపుకోవచ్చని హోంశాఖ సృష్టం చేసింది.
Govt of India extended the lock down up to 31 May 2020.
Ministry of Home Affairs, Govt of India issued a GO extending the lick down from 18 May 2020 to 31 May 2020 considering the all points as well as performance of control mechanism visa vis relaxing the controls for opening the businesses and supporting the economy.
Click here for Lockdown Extension with Guidelines






