భారత్ నుంచి 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు వెనుకకు
భారత్ నుంచి కరోనా కల్లోలంలో 1600 కోట్ల డాలర్ల (మన కరెన్సీలో అయితే 1.2 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వెనకకు వెళ్లాయి. ఆసియా దేశాల నుంచి మొత్తంగా 2600 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వెనుకకు వెళ్లాయి. అమెరికా కాంగ్రెస్ పరిశోధనా కేంద్రం తాజా నివేదికలో ఈ సంగతి వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంపై ఈ నివేదికను రూపొందించారు. యూరప్ లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, యూకే, స్పెయిన్ దేశాల్లో 3 కోట్ల మంది ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అమెరికా జీడీపీ 2020 తొలి త్రైమాసికంలో 4.8 శాతం తగ్గిందని నివేదికలో తెలిపారు.






