200 వెంటిలేటర్లు ఇవ్వనున్న అమెరికా
భారత్‌కు వెంటిలేటర్లు విరాళం ఇవ్వనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ..భారత్‌కు 200 వెంటిలేటర్లు విరాళం ఇవ్వన్నుట్లు తెలిసింది. కోవిడ్ 19 మహమ్మారిని నియంత్రించే క్రమంలో అగ్రరాజ్యం అమెరికా మనకు సాయం చేస్తున్నది. రాబోయే నెల రోజుల్లో ఆ వెంటిలేటర్లు మనకు అందనున్నాయి. మే, జూన్ నెలల్లో రెండు దఫాల్లో వెంటిలేటర్లు విరాళం ఇవ్వనున్నట్లు అమెరికా వెల్లడించింది. వాస్తవానికి అమెరికా అవసరాల కోసం వెంటిలేటర్లు తయారు చేశారు. ఇతర దేశాలు కూడా ఆ వెంటిలేటర్లు వాడుకునే విధంగా మారుస్తున్నారు. అయితే విరాళంలో భాగంగా కొన్నింటిని ఇండియాకు పంపిస్తున్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కేలీగ్ మెకన్నీ తెలిపారు. ఇండియాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువైంది.






