గాంధీ విగ్రహంపై దాడి…సారీ

వాషింగ్టన్ డీసీ ఇండియన్ ఎంబసీలో ఉన్న గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ ఘటనపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమంలో ఈ ఘటనను ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇది కేవలం విగ్రహంపై జరిగిన దాడి కాదని..భారత సమాజంపైనా, విలువలపైనా జరిగి దాడిగా, బారత సమాజానికి జరిగిన అవమానంగా పేర్కొంటున్నారు. గాందీజీ విగ్రహ ధ్వంసం ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేసింది. గాంధీ విగ్రహ ధ్వంసం ఘటనపై వాషింగ్టన్ పార్క్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. విగ్రహాన్ని కవర్ తో కప్పి ఉంచారు. కాగా, గాంధీ విగ్రహ ధ్వంసాన్ని అమెరికా ఖండించింది. ఇందుకు క్షమాపణలు చెబుతున్నట్లు అమెరికా ప్రకటించింది. తమ క్షమాపణలు అంగీకరించాలంటూ అమెరికా అంబాసిడర్ కెన్ జస్టర్ ట్వీట్ చేశారు.