19న యూఎస్ఏ, కెనడా అడ్మిషన్ డే
యూఎస్ఏ, కెనడా దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థిని, విద్యార్థుల కోసం యూని ఎక్స్పర్ట్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్లోని సోమాజిగూడ సంస్థ కార్యాలయంలో యూఎస్ఏ అడ్మిషన్ డే నిర్వహిస్తున్నట్లు సంస్థ ఆపరేషన్ హెడ్ ఉమా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ యూఎస్ఏ, కెనడాల్లో చదవాలనుకునే విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశమన్నారు. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో పాల్గొనే విద్యార్థులు, తల్లిదండ్రులు వీసా రిక్రూట్మెంట్స్, అడ్మిషన్ రిక్రూట్మెంట్స్, సాల్కర్షిప్ ఆప్షన్స్, లాంగర్ స్టే బ్యాంక్ ఆప్షన్స్, ట్రావెల్ అప్డేట్స్, ప్రవేశానికి హామీ తదితర అంశాలపై నేరుగా యూనివర్సిటీ ప్రతినిధులతో చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9912328645 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు.







