Ponnam Prabhakar: బీఆర్ఎస్లా మేం కక్ష సాధింపు చర్చలకు పాల్పడం : మంత్రి పొన్నం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేసీఆర్‌కు గురుదక్షిణగా కిషన్ రెడ్డి (Kishan Reddy)బీజేపీ అభ్యర్థిని బలి ఇస్తున్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024 లోక్‌సభ ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందంతో బీఆర్ఎస్ (BRS) కిషన్‌రెడ్డికి సహకరించింది. అందుకు గురుదక్షిణ కింద కేసీఆర్ (KCR)కు కిషన్‌రెడ్డి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని బలి ఇస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈ ఉప ఎన్నికలో బీజేపీకి తక్కువ ఓట్లు వస్తే ఏంచేస్తారో కిషన్‌రెడ్డి చెప్పాలి. ఈసారి బీజేపీకి 10 వేల కంటే ఎక్కువ ఓట్లు పడవు అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఫిర్యాదులొస్తే ఎవరి ఇళ్లలోనైనా ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్లు సోదాలు చేయడం సాధారణం. గత బీఆర్ఎస్ సర్కారులా మేం కక్ష సాధింపు చర్యలకు పాల్పడం అని అన్నారు.







