Kolikapudi: వారి ఆస్తులను వెంటనే జప్తు చేయాలి : ఎమ్మెల్యే కొలికపూడి
కల్తీ మద్యం కేసులో నిందితులను జైలుకు పంపించడంతో పాటు, వారి ఆస్తులు జప్తు చేయాలని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) డిమాండ్ చేశారు. తిరువూరు (Thiruvur) లో ప్రజా దర్బార్ నిర్వహించిన అనంతరం కొలికపూడి మీడియాతో మాట్లాడారు. గత నెల రోజులుగా కల్తీ మద్యంపై అరెస్టులు పర్వం కొనసాగుతుందన్నారు. గత వైసీపీ (YCP) ప్రభుత్వంలోనే జోగి రమేశ్ (Jogi Ramesh) కల్తీ మద్యం దందా నిర్వహించేవాడని, అనతి బినామీలు అందరూ కటకటాల్లోకి వెళ్తున్నారన్నారు. అలాంటి వారి ఆస్తులను వెంటనే జప్తు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు తెలిపారు.






