TTA: టిటిఎ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ఆధ్వర్యంలో అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను అమెరికా అంతటా విస్తరించడంతోపాటు తెలంగాణ ఎన్నారైలకు, తెలంగాణ రాష్ట్రానికి తనవంతుగా టిటిఎ సేవలందిస్తూ వస్తోంది. ముఖ్యంగా తెలంగాణ పండుగలైన బోనాలు, బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించడంతోపాటు అందరినీ ఇందులో భాగస్వాములను చేస్తుంది. ఇప్పుడు దసరా పండుగ రాకతో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు టిటిఎ నాయకులు ఏర్పాట్లు చేశారు. వివిధ నగరాల్లో ఉన్న టిటిఎ ఛాప్టర్లు ఆయా నగరాల్లో ఈ వేడుకలను వైభవంగా నిర్వహించనున్నది. న్యూజెర్సి, ఇండియానాపొలిస్, డల్లాస్ నగరాల్లో బతుకమ్మ వేడుకలను వైభవంగా నర్విహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇతర నగరాల్లో కూడా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు టిటిఎ నాయకులు తెలిపారు.