TANTEX: టాంటెక్స్ 218వ ‘నెల నెలా తెలుగు వెన్నెల’ ముహూర్తం ఫిక్స్

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) ప్రతి నెలా నిర్వహించే ‘నెలనెలా తెలుగు వెన్నెల’ సాహిత్య వేదిక సెప్టెంబరు 21వ తేదీన జరగనుంది. లూయిస్‌విల్లెలోని మాక్‌ఆర్థర్ బోలెవర్డ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 (సెంట్రల్ స్టాండర్డ్ టైం) వరకు ఈ సదస్సు జరగనుంది. ఇది ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) నిర్వహిస్తున్న 218వ సాహిత్య సదస్సు కావడం గమనార్హం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వోలేటి పార్వతీశం, గని హాజరవనున్నారు. దాశరథి జీవితం, సాహిత్యంపై పార్వతీశం ప్రసంగించనున్నారు. గని మాటా-పాట అంశంపై గని మాట్లాడతారు.
ఈ కార్యక్రమానికి డైమండ్ స్పాన్సర్‌గా రాజేష్ కల్లెపల్లి, ప్లాటినం స్పాన్సర్లుగా డాక్టర్ ప్రేమ్ రెడ్డి, బావర్చీ ఇండియన్ కూయిజిన్, ఇండియా బజార్, షూరా ఈబీఎస్, ఎస్‌జీఏ కన్సట్రక్షన్స్, తిరుమలరెడ్డి కుంబం ఉన్నారు. ఈ కార్యక్రమం గోల్డ్ స్పాన్సర్లు తనిష్క్ యూఎస్ఏ, ఎపిక్ ఈవెంట్స్, మై ట్యాక్స్ ఫైలర్, ది లా ఫర్మ్ ఆఫ్ సిమ్ పర్వతనేని అండ్ బ్రౌన్, రాయలసీమ రుచులు, శరత్ రెడ్డి యెర్రం అండ్ ఫ్యామిలీ, గురు ట్యాక్స్ ప్రో. ఈ సదస్సు సిల్వర్ స్పాన్సర్లు రిజమ్‌సాఫ్ట్, ఎల్డొరాడో పెట్ హాస్పిటల్స్, డాక్టర్ నరసింహా రెడ్డి ఉరిమిండి, ఫ్రిస్కో డెంటల్ హబ్, ఎల్ ఎన్ కోయా సీపీఏ ఎల్ఎల్‌సీ, సేఫ్ హావెన్ సైకియాట్రీ, రమణ్ రెడ్డి క్రిస్టపాటీ అండ్ ఫ్యామిలీ, జుబెక్ సొల్యూషన్స్ ఐఎన్‌సీ.
ఈ సదస్సు మీడియా పార్టనర్లుగా సాక్షి టీవీ, టీవీ9 తెలుగు, మహాన్యూస్, టీవీ5, ఏక్ నజర్, ఐ ఏసియా న్యూస్, తెలుగు టైమ్స్, ఎన్నారై2ఎన్నారై, ఫన్ ఏసియా, కాడియా క్యారవాన్, క్రాస్‌రోడ్స్ మీడియా, ఎన్నారై పేజ్, ప్రైమ్ 9 న్యూస్, రేడియో సురభి, నమస్తే ఎన్నారై సేవలందిస్తున్నాయి. ఈ కార్యక్రమం గురించి సంప్రదించేందుకు సమన్వయకర్త దయాకర్ మాడను sahityavedika@tantex.org లో సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమాన్ని జూమ్‌లో https://bit.ly/3svKJbo లింకులో చూడవచ్చు. సమావేశం ఐడీ 7882506018, పాస్ కోడ్ 432781 అని టాన్ టెక్స్ తెలిపింది.